తెలంగాణ

telangana

ETV Bharat / sports

దేశవాళీ సమరం నేటి నుంచే.. బరిలో సీనియర్లు - prithvi shaw

సోమవారం నుంచి ప్రారంభమయ్యే రంజీ టోర్నీ.. మార్చి 13 వరకు జరగనుంది. ఇందులో టీమిండియా సీనియర్ క్రికెటర్లు, వర్థమాన ఆటగాళ్లు బరిలో దిగుతున్నారు. వారిలో పుృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, రహానే, అశ్విన్ తదితరులు ఉన్నారు.

Ranji Trophy: Game time for Test specialists, opportunity and hope for rest
దేశవాళీ సమరం నేటి నుంచే.. బరిలో సీనియర్లు

By

Published : Dec 9, 2019, 5:11 AM IST

దేశవాళీలో అతిపెద్ద సమరమైన రంజీ ట్రోఫీ.. నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. భారత అగ్రశ్రేణి క్రికెటర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నారు. భారత టెస్టు క్రికెటర్లయిన చతేశ్వర్​ పుజారా, పృథ్వీ షా తదితరులు ఇందులో సత్తాచాటి రానున్న విదేశీ పర్యటనల్లో రాటుదేలాలని అనుకుంటున్నారు.

పృథ్వీషా

వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో విరాట్ సారథ్యంలోని టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్​ ఆడనుంది. మళ్లీ ఫిబ్రవరి మూడో వారంలో కివీస్​తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్​లోపు తాము సన్నద్ధం కావాలని భారత టెస్టు స్పెషలిస్టులు భావిస్తున్నారు.

పుజారా(సౌరాష్ట్ర), అజింక్య రహానే(ముంబయి), మయాంక్ అగర్వాల్(కర్ణాటక), రవిచంద్రన్ అశ్విన్(తమిళనాడు) రంజీ ట్రోఫీతో మరింత పదునుగా తయారవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఉమేశ్, యాదవ్, ఇషాంత్ శర్మ ఆరంభ మ్యాచ్​లకు దూరం కానున్నారు. బీసీసీఐ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అశ్విన్​

ఇటీవల గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య.. దేశవాళీలో ఫిట్​నెస్ సాధించి జాతీయ జట్టులోకి రావాలనే కుతూహులంతో ఉన్నారు. ఈ టోర్నీలో కొన్ని మ్యాచ్​ల్లో వీరు ఆడనున్నారు.

ఈ సీజన్​లో జట్ల మధ్య కంటే ఆటగాళ్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. గ్రూప్​-బిలో తమిళనాడు - కర్ణాటక మ్యాచ్​ జరగనుంది. ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్​లు ప్రత్యర్థులుగా తలపడనున్నారు. అదే విధంగా ముంబయి(రహానే) - బరోడా(పృథ్వీ షా) మధ్య మ్యాచ్​ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశముంది.

ఈ రంజీ టోర్నీ.. వచ్చే ఏడాది మార్చి 13 వరకు జరగనుంది. మొత్తం 38 జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది కొత్తగా ఛండీఘడ్ కూడా ఆడనుంది.

ఇదీ చదవండి: దంచి కొట్టిన దూబే.. భారత్​ స్కోరు 170/7

ABOUT THE AUTHOR

...view details