ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆదివారం ఫ్రాంచైజీ వెల్లడించింది. రానున్న లీగ్‌లో టీమ్ మెంటార్‌గానూ వార్న్ వ్యవహరించనున్నట్లు తెలిపింది. దీంతో ఐపీఎల్ ట్రోఫీ సాధించేందుకు జట్టుకు మరింత బలం చేకూరినట్లైంది. ఈ సందర్భంగా వార్న్ మాట్లాడుతూ.. రాయల్స్ బృందంతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నాడు.
"రాజస్థాన్ బృందం నా కుటుంబం లాంటింది. ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్లో జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. జుబిన్ భారుచా, ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వంటి అద్భుతమైన సిబ్బందితో కలవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కచ్చితంగా ఈ లీగ్‌లో జట్టును విజయం వైపు నడిపిస్తాం."