తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. బెంగళూరుతో మ్యాచ్ - rajastan royals

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదటగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్

By

Published : Apr 30, 2019, 7:48 PM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది రాజస్థాన్​. బ్యాటింగ్​కు స్వర్గదాయకమైన చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది బెంగళూరు. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే రాయల్స్ కచ్చితంగా ఈ మ్యాచ్​ గెలిచి తీరాల్సిందే.

రాజస్థాన్ సారథి స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్ తర్వాత స్వదేశానికి వెళ్లనున్నాడు. జట్టును గెలిపించి విజయోత్సాహంతో తిరుగు ప్రయాణం చేయాలని భావిస్తున్నాడు.

మరోవైపు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన బెంగళూరు మిగిలిన మ్యాచ్​లను గెలిచి కాస్త ఊరట పొందాలని అనుకుంటోంది.

రాజస్థాన్ జట్టులో టర్నర్ స్థానంలో మహిపాల్ లోమ్రర్ చోటు సంపాదించాడు. బెంగళూరు రెండు మార్పులతో బరిలోకి దిగింది. శివమ్ దూబే స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియా ఆడనుండగా.. పవన్ నేగి తిరిగి జట్టులో చోటు సంపాదించాడు.

జట్లు
రాజస్థాన్ రాయల్స్

స్టీవ్ స్మిత్ (సారథి), రహానే, లివింగ్ స్టోన్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, మహిపాల్ లోమ్రోర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్​, వరుణ్ ఆరోన్​, ఒషానే థామస్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కోహ్లీ (సారథి), పార్థివ్ పటేల్, డివిలియర్స్, హెన్రిచ్ క్లాసన్, గురుకీరత్ సింగ్, మార్కస్ స్టోయినిస్, పవన్ నేగి, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్వంత్ ఖేజ్రోలియా, చాహల్

ABOUT THE AUTHOR

...view details