తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన రాజస్థాన్... ముంబయి బ్యాటింగ్ - mumbau indians

జైపుర్ వేదికగా ముంబయితో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​కు రహానే నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు స్టీవ్ స్మిత్.

ఐపీఎల్

By

Published : Apr 20, 2019, 3:52 PM IST

ముంబయి ఇండియన్స్​తో తలపడుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ ​రాయల్స్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జైపుర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​కు రాజస్థాన్​ కెప్టెన్​గా స్టీవ్​ స్మిత్​ వ్యవహరించనున్నాడు. రహానేను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం.

గత రెండు మ్యాచ్​ల్లో పిచ్​ స్లోగా ఉండి బౌలింగ్​కు అనుకూలించింది. ఈసారీ మొదట బౌలింగ్ తీసుకునే జట్టుకే కలిసొచ్చే అవకాశముంది. ఆడిన ఎనిమిది మ్యాచ్​ల్లో ఆరింటిలో పరాజయం చెందిన రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్​లోనూ గెలవాల్సిందే.

వరుస విజయాలతో దూసుకెళ్తోంది ముంబయి జట్టు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్​లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు పదిలం చేసుకోవాలనుకుంటోంది.

జట్టులో మూడు మార్పులు చేసింది రాజస్థాన్. సోధి స్థానంలో స్టోక్స్ జట్టులోకి వచ్చాడు. రాహుల్ త్రిపాఠి స్థానంలో రియాన్ పరాగ్ ఆడనున్నాడు. బట్లర్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. ముంబయి జట్టులో జయంత్ యాదవ్ స్థానంలో మయాంక్ మార్కండే ఆడనున్నాడు.

జట్లు..
రాజస్థాన్ రాయల్స్​..

సంజూ శాంసన్(కీపర్), రహానే, స్మిత్(కెప్టెన్), స్టోక్స్, టర్నర్, స్టువర్ట్ బిన్ని, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ఉనాద్కత్, ధవల్ కులకర్ణి

ముంబయి ఇండియన్స్​...
రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, హార్ధిక్ పాండ్య, పొలార్డ్, బెన్ కట్టింగ్, రాహుల్ చాహర్, మయాంక్ మార్కండే, మలింగ, బుమ్రా

ABOUT THE AUTHOR

...view details