హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన ముంబయి ఇండియన్స్.. రాజస్థాన్ రాయల్స్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఆరంభంలోనే సారథి రోహిత్ (5) వికెట్ కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్‌తో కలిసి మరో ఓపెనర్ డికాక్ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే డికాక్ అర్ధసెంచరీ సాధించాడు. రాజస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్.
రాణించిన డికాక్... రాజస్థాన్ లక్ష్యం 162 పరుగులు - rajastan royals
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. డికాక్ అర్ధశతకంతో రాణించాడు.
ఐపీఎల్
డికాక్ 65 పరుగులు చేసి ఔటవగా సూర్య కుమార్ యాదవ్ (34) ఆకట్టుకున్నాడు. పొలార్డ్ (10) త్వరగానే పెవిలియన్ చేరినా హార్దిక్ పాండ్య (23) కాసేపు మెరిశాడు.
రాజస్థాన్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేశారు. శ్రేయస్ గోపాల్ రెండు వికెట్లతో మెరవగా, బిన్నీ, ఆర్చర్, ఉనద్కట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.