తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సుశాంత్​.. నీవెప్పుడూ మా హృదయాల్లో ఉంటావు' - Sushant sing rajput news

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సుశాంత్​ మృతికి న్యాయం జరగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'సుశాంత్​.. నీవెప్పుడూ మా హృదయాల్లో ఉంటావు'
'సుశాంత్​.. నీవెప్పుడూ మా హృదయాల్లో ఉంటావు'

By

Published : Aug 25, 2020, 4:55 PM IST

Updated : Aug 25, 2020, 6:19 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతికి గల కారణాలు వెలుగులోకి రావాలని, న్యాయం జరగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి క్రికెటర్‌ సురేశ్ రైనా కూడా చేరాడు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేసి, అతడికి తప్పక న్యాయం జరుగుతుందంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు.

"సోదరుడా, నువ్వు ఎప్పుడూ మా హృదయాల్లో సజీవంగా ఉంటావు. నీ అభిమానులు నిన్ను చాలా మిస్‌ అవుతున్నారు. మన ప్రభుత్వం నీకు న్యాయం జరిగేలా చూస్తుందని నమ్ముతున్నా. నువ్వు నిజమైన ప్రేరణ!" అని వ్యాఖ్య జత చేశాడు.

రైనా షేర్ చేసిన వీడియోలో.. సుశాంత్ ఫొటోతో పాటు అతడు నటించిన కేదార్‌నాథ్'‌ చిత్రంలో పాట వినిపిస్తోంది. అలాగే 'వి ఆర్‌ ఆల్‌ ఇన్‌ దిస్‌ టుగెదర్’', 'జస్టిస్‌ ఫర్ ఎస్‌ఎస్‌ఆర్'‌, 'ఫ్యామిలీ నీడ్స్‌ జస్టిస్' వంటి హ్యాష్‌ ట్యాగ్‌లు దాంట్లో కనిపిస్తున్నాయి.

సుశాంత్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Last Updated : Aug 25, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details