వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో ఆకట్టుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో(102) రాణించాడు. 235 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్లో పదో శతకాన్ని అందుకున్నాడు.
కీలక సమయాల్లో వికెట్ కాపాడుతూ.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 81కే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న జట్టును కోహ్లీ సాయంతో ఆదుకున్నాడు. ఇప్పటికే 39 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. విండీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా కొనసాగుతోంది.