ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అందులో 21 ఏళ్ల రచిన్ రవీంద్ర తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు. పేరు చూస్తే భారత సంతతి ఆటగాడి లాగే ఉంది కదా! అవును.. అతని మూలాలు ఇక్కడే ఉన్నాయి. అంతే కాదు కివీస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యే స్థాయికి చేరిన ఈ 21 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి సంబంధం ఉంది. ఇక్కడి స్పోర్ట్స్ అకాడమీలో అతను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆ విషయాలను అతనికి శిక్షణనిచ్చిన కోచ్ షాబుద్దీన్ 'ఈటీవీ భారత్'తో పంచుకున్నాడు.
ఇక్కడ ప్రాక్టీస్.. కివీస్ జట్టులో చోటు - అనంతపురంలో రచిన్ రవీంద్ర ప్రాక్టీస్
ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఇందులో 21 ఏళ్ల రచిన్ రవీంద్ర తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఇతడికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంతో సంబంధం ఉంది.
"బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర తొలిసారి 2016లో అనంతపూర్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే స్పోర్ట్స్ అకాడమీకి వచ్చాడు. ఇక్కడి శిక్షణతో సంతృప్తి చెందడం వల్ల ఏటా శీతాకాలంలో న్యూజిలాండ్ నుంచి హట్ హాక్స్ క్లబ్బు తరపున వచ్చి ఇక్కడే శిక్షణ పొందేవాడు. లెఫ్టార్మ్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన అతను.. మొదట్లో బ్యాట్స్‌మన్. నిలకడగా మంచి ప్రదర్శన చేసిన అతడు త్వరగానే న్యూజిలాండ్ అండర్-19, 'ఎ' జట్ల తరపున ఆడాడు. కేవలం శిక్షణ కోసం అమ్మానాన్నలను వదిలి ఇంత దూరం వచ్చి ఉండేవాడు" అని వివరించాడు.