తెలంగాణ

telangana

ETV Bharat / sports

రబాడా స్లెడ్జింగ్ చేయాలనుకున్నాడు.. కానీ..! - south africa vs india

దక్షిణాఫ్రికా బౌలర్​ రబాడా పుజారాను స్లెడ్జింగ్​ చేయాలని ప్రయత్నించాడు. కానీ తన హద్దులో తాను ఉన్నానని తెలిపాడు పుజారా.

పుజారా

By

Published : Oct 11, 2019, 5:31 AM IST

దక్షిణాఫ్రికా పేసర్ రబాడా బౌలింగ్​ ఎంత పదునుగా ఉంటుందో అతడి మాటలు అంతే పదునుగా ఉంటాయి. తాజాగా టీమిండియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో పుజారాను ఇలాగే కవ్వించాడీ ఆటగాడు. కానీ పుజారా మాత్రం తన హద్దుల్లో తానున్నాని తెలిపాడు.

పుజారా 58 పరుగులు చేశాక రబాడా బౌలింగ్​లో ఔటయ్యాడు. అపుడు రబాడా పుజారాను ఉద్దేశిస్తు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై పుజారా స్పందించాడు.

"రబాడా ఏమన్నాడో గుర్తు లేదు. అతడు ఎపుడు బ్యాట్స్​మన్​ను కవ్వించడానికి ప్రయత్నిస్తాడు. ఓ బ్యాట్స్​మన్​గా నాకు ఆ విషయం తెలుసు. నా ఏకాగ్రతకు భంగం కలిగించడానికి బౌలర్లు ఏం చేసినా.. వాటిని పట్టించుకోకుండా నేను నా పరిధిలో ఉంటా."
-పుజారా, టీమిండియా ఆటగాడు

ఈ మ్యాచ్​లో పుజారా 112 బంతుల్లో 58 పరుగులు చేసి రబాడా బౌలింగ్​లో ఔటయ్యాడు. ఇందులో ఒక సిక్సు,9 ఫోర్లు ఉన్నాయి.

ఇవీ చూడండి.. తనపై తానే సెటైర్ వేసుకున్న చాహల్

ABOUT THE AUTHOR

...view details