బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. సొంతగడ్డపై వేగంగా 250 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 42 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు.
బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్‌ను ఔట్ చేసి ఈ ఘనత అందుకున్నాడు అశ్విన్. మొత్తంగా సుధీర్ఝ ఫార్మాట్లో 358 వికెట్లు తీశాడు.
సొంతగడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే(350) మొదటి స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్ 265 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్.. భారత బౌలర్లు ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఆ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ కాసేపు పోరాడినప్పటికీ టీమిండియా బౌలర్ల దూకుడు ముందు తేలిపోయారు. రెండో సెషన్ ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేశారు.