పంజాబ్ కింగ్స్‌తో తలపడిన తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో రాహుల్ సేన గెలిచింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శాంసన్ సేన నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(119; 63 బంతుల్లో 12x4, 7x6) శతకంతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ దీపక్ హుడా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై పంజాబ్ గెలుపు - punjab kings
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ ఓటమిపాలైంది. కెప్టెన్ సంజూ శాంసన్ శ్రమ వృథా అయింది.
కాగా, పెద్ద లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన బెన్‌స్టోక్స్(0) తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరగా, జట్టు స్కోర్ 25 పరుగుల వద్ద మరో ఓపెనర్ మనన్ వోహ్రా(12) ఔటయ్యాడు. తర్వాత సంజూ ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో జోస్‌బట్లర్(25), శివమ్ దూబె(23), రియాన్ పరాగ్(25) తమవంతు కృషి చేసినా భారీ స్కోర్లు సాధించలేకపోయారు. చివర్లో ధాటిగా ఆడిన సంజూ మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించినా అర్ష్‌దీప్‌సింగ్.. రాజస్థాన్‌కు విజయాన్ని దూరం చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. సిక్సర్ల వర్షం కురిపించారు. దీపక్ హుడా (64; 28 బంతుల్లో 4x4, 6x6), కేఎల్ రాహుల్ (91; 50 బంతుల్లో 7x4, 5x6) దంచి కొట్టారు. ముఖ్యంగా దీపక్ 20 బంతుల్లో అర్ధ శతకం సాధించి రాజస్థాన్ బౌలర్లకు దడ పుట్టించాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడే క్రమంలో 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్‌లో నికోలస్ పూరన్ డకౌటయ్యాడు. చివరికి పంజాబ్ 20 ఓవర్లలో 221/6 స్కోర్ సాధించింది. చేతన్ సకారియా వేసిన చివరి ఓవర్‌లో రాహుల్ ఔటయ్యాడు. అంతకుముందు ఓపెనర్ మయాంక్ అగర్వాల్(14) విఫలమవ్వగా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ (40; 28 బంతుల్లో 4x4, 2x6) పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ మూడు వికెట్లు తీయగా, క్రిస్‌మోరిస్ రెండు, రియాన్ పరాగ్ ఒక వికెట్ పడగొట్టాడు.