తెలంగాణ

telangana

ETV Bharat / sports

పృథ్వీషా స్టన్నింగ్​ క్యాచ్​.. అతనే నమ్మలేదు! - పృథ్వీ షా స్టన్నింగ్​ క్యాచ్​

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్​లో టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ పృథ్వీషా అద్భుత క్యాచ్​ పట్టాడు. ఆ క్యాచ్​ ద్వారా టిమ్​ పైన్​ పెవిలియన్ చేరాడు.

Prithvi Shaw takes stunning catch to dismiss Tim Paine in warm-up game
పృథ్వీషా స్టన్నింగ్​ క్యాచ్​.. అతనే నమ్మలేదు!

By

Published : Dec 7, 2020, 5:14 PM IST

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్​లో టీమ్​ఇండియా క్రికెటర్​ పృథ్వీ షా అద్భుత క్యాచ్​ పట్టాడు. ఆసీస్​ టెస్టు కెప్టెన్​ టిమ్​ పైన్​ను పెవిలియన్​ చేర్చడానికి తన సహకారాన్ని అందించాడు.

బ్యాటింగ్​లో అంతగా రాణించకపోయినా.. ఫీల్డింగ్​లో పృథ్వీ తనదైన మార్క్​ చూపిస్తున్నాడు. ఉమేశ్​ యాదవ్​ వేసిన షార్ట్​ బంతిని ఎదుర్కొన్న టిమ్​ పైన్ (44)​ పుల్​షాట్​ ఆడబోయి స్క్వేర్​ లెగ్​లో ఫీల్డింగ్​ చేస్తున్న పృథ్వీషాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పైన్​, గ్రీన్​ మధ్య సెంచరీ భాగస్వామ్యానికి బ్రేక్​ పడింది.

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌-ఎ జట్టు 9 వికెట్లకు 247 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్​ డిక్లేర్ చేసింది. కెప్టెన్​ రహానె(117) సెంచరీతో అలరించగా.. పుజారా (54) పర్వాలేదనిపించాడు. కాగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. హనుమ విహారి (15) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 286 పరుగులు చేసింది. కామెరూన్​ గ్రీన్​ (114) శతకంతో అలరించాడు. ప్రస్తుతం భారత్​ కంటే ఆస్ట్రేలియా 39 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చూడండి:మెరిసిన గ్రీన్.. భారత్​పై ఆసీస్​ పైచేయి

ABOUT THE AUTHOR

...view details