ముంబయి జట్టు.. విజయ్ హజారే టోర్నీ ఫైనల్‌కు చేరడంపై హర్షం వ్యక్తం చేశాడు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ఉత్తర్‌ప్రదేశ్‌తో మార్చి14న జరగనున్న తుది పోరులో.. జట్టులో ఎటువంటి మార్పులు చేయొద్దని ముంబయి కెప్టెన్ పృథ్వీ షాకు సూచించాడు. తమ సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించాలని తెలిపాడు.
తొలుత ముంబయి జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన శ్రేయస్.. ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా పృథ్వీ షాను నియమించారు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న పృథ్వీ.. ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. జట్టును ఫైనల్ చేర్చాడు.
నేనైతే ఒత్తిడికి లోను కాలేదు..
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అర్థ సెంచరీతో రాణించాడు శ్రేయస్ అయ్యర్. ఆ మ్యాచ్‌లో స్వేచ్ఛగా, సంతోషంగా ఆడినట్లు తెలిపాడు. తన ఆటను చాలా ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఒత్తిడికి లోను కాలేదని అభిప్రాయపడ్డాడు.