చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్ సాయిప్రణీత్ శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్ ఆంథోనీ జిన్‌టింగ్ చేతిలో 16-21, 21-6, 21-16 తేడాతో పరాజయం చెందాడు.
చైనా ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు సాయిప్రణీత్ ఓటమిపాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఆంథోనీ జిన్ టింగ్ చేతిలో పరాజయం చెందాడు.
సాయి
ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇదే జిన్టింగ్పై ఘనవిజయం సాధించాడు ప్రణీత్. కానీ ఈసారి మాత్రం అతడికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్ తొలి గేమ్‌ను గెలుచుకుని ఊపుమీద కనిపించాడు. రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11-7తో ముందంజలో ఉన్నా.. అనంతరం తడబడి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.
ఇవీ చూడండి.. కోహ్లీ ఇలా ఉండటానికి కారణం వారిద్దరే: గంభీర్
Last Updated : Oct 1, 2019, 10:11 AM IST