తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: సచిన్ మెచ్చిన ఆటగాళ్లు వీరే... - warner

ప్రపంచకప్​లో వార్నర్, రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ సత్తాచాటగలరని ఆశాభావం వ్యక్తం చేశాడు సచిన్.

సచిన్

By

Published : May 31, 2019, 5:11 PM IST

ప్రపంచ కప్​లో భారత్​ ఫేవరేట్ అంటున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్... ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. అప్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్​ సత్తాచాటగలరని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అప్ఘన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఎలా ఆడతాడా అని ఎదురుచూస్తున్నానని తెలిపాడు సచిన్. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను తన బౌలింగ్​తో రషీద్ ఇబ్బందిపెట్టగలడని అన్నాడు.

"వార్నర్ ఎప్పుడూ పరుగులు సాధించాలనే కోరికతో ఉంటాడు. ఫిట్​గా ఉంటూ దృష్టిపెట్టి ఆడతాడు. ఐపీఎల్​లో చాలా బాగా ఆడాడు. ఈ ప్రపంచకప్​లో వార్నర్ ఆట చూడాల్సిందే".
-సచిన్, భారత మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ కచ్చితమైన బంతులతో బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టగలడని తెలిపాడు సచిన్. మ్యాచ్​ను తమ జట్టువైపు తిప్పగల సత్తా ఉన్న బౌలర్​ అని కొనియాడాడు.

ఇవీ చూడండి.. పాక్​ కెప్టెన్​ను వెనుకేసుకొచ్చిన భారతీయులు

ABOUT THE AUTHOR

...view details