తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రేయస్​కు గాయం- ఐపీఎల్​కు అనుమానం! - సామ్ బిల్లింగ్స్

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో గాయపడ్డ శ్రేయస్​ అయ్యర్​.. ఐపీఎల్​లో ఆడేది అనుమానంగా మారింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని బీసీసీఐ వెల్లడించింది.

Players of both the teams were injured in the first ODI being played in Pune.
శ్రేయస్​ అయ్యర్​ ఐపీఎల్​కు అనుమానమే: బీసీసీఐ

By

Published : Mar 23, 2021, 8:10 PM IST

Updated : Mar 23, 2021, 10:32 PM IST

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో గాయపడ్డ శ్రేయస్​ అయ్యర్.. ఐపీఎల్​లో ఆడేది అనుమానంగా మారింది. అతని గాయం తీవ్రంగా ఉందని బీసీసీఐ వెల్లడించింది. ​"ఇంగ్లాండ్ ఇన్నింగ్స్​​ 8వ ఓవర్లో బెయిర్​ స్టో కొట్టిన బంతిని ఆపే క్రమంలో శ్రేయస్​ డైవ్​ చేయగా.. అతడి చేయి నేలను బలంగా తాకింది. శ్రేయస్​ భుజం కొంతమేర డిస్​లొకేట్​ అయ్యింది. దీనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. సమస్య తీవ్రమైతే ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది," అని తెలిపింది.

ఈ గాయం నుంచి ఆటగాళ్లు కోలుకోవడానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. సర్జరీ చేయాల్సి వస్తే కోలుకునేందుకు ఆరు వారాలకు మించి సమయం పడుతుంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రేయస్​ గాయం దిల్లీ క్యాపిటల్స్​ను కలవరపెట్టే విషయమే.

మరో ఇద్దరు...

"మరో భారత ఆటగాడు రోహిత్ ఫీల్డింగ్​కు దిగలేదు. బ్యాటింగ్​ చేస్తుండగా మార్క్ వుడ్​ బౌలింగ్​లో గాయపడ్డాడు" అని బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్​ మైదానంలోకి దిగాడు.

అంతకుముందు భారత బ్యాటింగ్​ సందర్భంగా ఇంగ్లాండ్​ ప్లేయర్​ సామ్ బిల్లింగ్స్​కు కూడా గాయమైంది. ఇన్నింగ్స్​ 33వ ఓవర్లో శిఖర్​ ధావన్​ కొట్టిన బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్ గాయపడ్డాడు. "అతని భుజం ఎముకకు గాయమైంది. 2019లో జరిగిన గాయంతో దీనికి సంబంధం లేదు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ మ్యాచ్​లో బ్యాటింగ్​ చేస్తాడనే నమ్మకం ఉంది" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఇదీ చదవండి:అరంగేట్రంలోనే కృనాల్ అరుదైన రికార్డు ​

Last Updated : Mar 23, 2021, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details