శనివారం నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూపర్లీగ్పై కరోనా వైరస్ ప్రభావం పడింది. టోర్నీలో పాల్గొనాల్సిన ఓ క్రికెటర్‌కు కొవిడ్ సోకినట్లు పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా బారిన పడిన ఆటగాడి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
"కొవిడ్ లక్షణాలు కలిగిన ఓ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాడికి క్వారంటైన్‌కు తరలించగా.. అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఆ క్రికెటర్ రాబోయే పది రోజుల పాటు నిర్బంధంలో ఉండనున్నాడు. తర్వాత అతడికి చేసిన పరీక్షల్లో రెండు సార్లు నెగటివ్ వస్తే శిబిరంతో కలిసి ఆడేందుకు అనుమతిస్తాం".
- పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటన