తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెలిస్తేనే దక్కుతుంది పరువు: వెసెల్స్ - cricket

ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా గెలవాలని.. అపుడే మెగాటోర్నీలో ఉన్న 'చోకర్స్' అనే చెడ్డపేరును తొలగించుకోవచ్చని ఆ జట్టు మాజీ సారథి కెప్లెర్ వెసెల్స్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు నాలుగో స్థానానికి కోహ్లీ సరిపోతాడని విశ్లేషించాడు.

దక్షిణాఫ్రికా

By

Published : May 21, 2019, 10:05 AM IST

ప్రపంచకప్​లో అత్యంత నిరాశపర్చిన జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికాయే. ఇప్పటివరకు మెగాటోర్నీని గెలవలేదు. మంచి ఆటగాళ్లున్నా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాలేదు. మరికొన్ని సార్లు జట్టుగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి మాత్రం ప్రొటీస్ కప్​ కొట్టాలంటున్నాడు ఆ జట్టు మాజీ సారథి కెప్లర్ వెసెల్స్.

"1999లో దక్షిణాఫ్రికా అత్యుత్తమ జట్టు అయినప్పటికీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఈసారి సఫారీలు ఫేవరెట్‌ కాకపోవడం మంచిదే. వారు గెలుస్తారన్న ఆశలూ లేవు. ఒత్తిడి లేకపోవడం వల్ల డుప్లెసిస్‌ సేన సులభంగా సెమీస్‌ చేరొచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే పై దశకు వెళ్లొచ్చు. ఏబీ డివిలియర్స్‌ చాలా కీలకం. అతడు లేని లోటు పూడ్చేందుకు దక్షిణాఫ్రికా ఇప్పుడు హషీమ్‌ ఆమ్లా, ఇతరులపై ఆధారపడాలి.

భారత్‌ పటిష్ఠమైన జట్టు. వారితో పాటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టం. భారత్‌లో నాలుగో స్థానంపై చర్చ జరుగుతోంది. పరిష్కారం కోసం కోహ్లీ ఆ స్థానంలో ఆడితే బాగుంటుంది. టీమిండియాలో ఓపెనర్లు 10 పరుగుల్లోపు వెనుదిరిగినా విరాట్‌ భారీ స్కోరు అందించగలడు".
-కెప్లెర్ వెసెల్స్, దక్షిణాఫ్రికా జట్టు మాజీ సారథి

ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టోర్నీ గెలిస్తేనే దక్షిణాఫ్రికా 'చోకర్స్' పేరు వదిలించుకోగలదని ఆ జట్టు మాజీ సారథి కెప్లర్‌ వెసెల్స్‌ అన్నాడు. సఫారీలు ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగకపోవడం అదృష్టమని తెలిపాడు. ఐసీసీ టోర్నీ గెలిచేంత వరకు జనాలు వారిని చోకర్స్‌ అని పిలుస్తూనే ఉంటారని.. అది నిజమని స్పష్టం చేశాడు.

ఇవీ చూడండి.. WC19: చరిత్రకు అడుగు దూరంలో భారత్ బోల్తా

ABOUT THE AUTHOR

...view details