తెలంగాణ

telangana

ETV Bharat / sports

15 కోట్లకు కొనుక్కుంటే.. కుక్క బొమ్మలు అడిగింది..! - Pat Cummins

ఐపీఎల్​లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆసీస్ బౌలర్ కమిన్స్​ను అతడి స్నేహితురాలు విలువైన బహుమతి అడిగిందట. అతడికొచ్చే డబ్బుతో తన పెంపుడు కుక్క కోసం బొమ్మలు కావాలని కోరిందట.

Pat Cummins' Girlfriend Wants To Buy More Dog Toys With His Hefty IPL Pay Cheque
ప్యాట్ కమిన్స్​

By

Published : Dec 24, 2019, 8:12 PM IST

ఐపీఎల్​లో రూ.15.50కోట్ల అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ క్రికెటర్​గా ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అంత భారీ మొత్తం తీసుకోనున్న కమిన్స్​కు తన గర్ల్​ ఫ్రెండ్ అప్పుడే అతడి ముందు బహుమతుల చిట్టా ఉంచేసింది. ఇంతకీ ఆమె ఏం కోరుకుందో తెలుసా? తన పెంపుడు కుక్క కోసం బొమ్మలు కావాలని కమిన్స్​ను అడిగిందట.

కమిన్స్​ తనకొచ్చే ఐపీఎల్ చెక్​తో ఈ బొమ్మలు తీసుకుంటానని ఆసీస్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

"ఐపీఎల్​లో భారీ మొత్తానికి నన్ను తీసుకున్నారని తెలిశాక నా స్నేహితురాలు తన పెంపుడు కుక్కకు బొమ్మలు కావాలని అడిగింది. కాబట్టి ఆమెకు కావాల్సినవి ఇచ్చి తీరాల్సిందేగా" - ప్యాట్ కమిన్స్​, ఆస్ట్రేలియా బౌలర్.

ఐపీఎల్ వేలంలో కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు కమిన్స్​ను రూ.15.50కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు 2014లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఈ ఆసీస్ పేసర్. మంగళవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో కమిన్స్ బౌలర్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి: బీసీసీఐ సెలక్షన్ విధానంపై విరుచుకుపడిన భజ్జీ

ABOUT THE AUTHOR

...view details