న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, జిమ్మీ నీషమ్ మధ్య ఓ చిన్నపాటి ఘర్షణ జరిగింది. సింగిల్ తీసే సమయంలో నీషమ్ అడ్డుకున్నాడని రాహుల్ ఆరోపించాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. అంపైర్ ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. మ్యాచ్ అనంతరం నీషమ్ దీనికి సంబధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని ఓ ఫన్నీ కామెంట్ జత చేశాడు.
'ఏప్రిల్ కోసం కొన్ని పరుగులు దాచి ఉంచుకో' - Jimmy Neesham's Shares Funny Picture With KL Rahul
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా క్రికెటర్ రాహుల్, కివీస్ ఆటగాడు జిమ్మీ నీషమ్ మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం దీనికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న నీషమ్ ఓ ఫన్నీ కామెంట్ జోడించాడు.
ఇందులో రాహుల్, నీషమ్, అంపైర్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ "కాగితం, కత్తెర, బండ?" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరో పోస్ట్‌లో "ఏప్రిల్ కోసం కొన్ని పరుగులు దాచి ఉంచడం మరువకు" అంటూ రాహుల్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో నీషమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టుకు రాహుల్ కెప్టెన్. అందుకే ఇలా సరదాగా ట్వీట్ చేశాడంటూ అభిమానులు అంటున్నారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ (112) సెంచరీతో సత్తాచాటగా.. శ్రేయస్ అయ్యర్ (62) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన కివీస్ 47.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నికోల్స్ (80), గప్తిల్ (66), గ్రాండ్‌హోమ్ (58) అర్ధశతకాలతో మెరిశారు.