పవర్ ప్లే ఓవర్లలో పరుగులు రావాలంటే శిఖర్ ధావన్ బాగా రాణించాల్సి ఉందని దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఏ క్రికెటర్ అన్ని మ్యాచుల్లోనూ బాగా ఆడటం సాధ్యం కాదంటూ రిషభ్ పంత్‌కు మద్దతుగా మాట్లాడాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్‌పై మాట్లాడిన రికీ పాంటింగ్.. ధావన్ ఇంకా మెరుగవ్వాల్సి ఉందా అన్న ప్రశ్నకు... 'అవును. కచ్చితంగా రాణించాల్సిందే. కానీ పవర్ ప్లే సమయంలో ఒక్కడే ఆడటం కష్టమైన విషయం' అని చెప్పాడు.
ధావన్ స్ట్రైక్ రేట్ 115 కి దిగువనే ఉంది. టీ20 ఫార్మాట్లో ఇది తక్కువ. ముంబయితో మ్యాచ్‌లో 43, చెన్నైపై 51 పరుగులు చేశాడు.