తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ ముందు అలా కొట్టడం ప్రత్యేకం'

బుధవారం చెన్నై-ముంబయి మ్యాచ్​లో హెలికాప్టర్ షాట్​తో అలరించాడు హార్దిక్ పాండ్యా. ధోని ముందు అలా సిక్స్ కొట్టడం తనకెంతో ప్రత్యేకమని చెప్పాడీ ఆల్​రౌండర్.

By

Published : Apr 4, 2019, 10:14 AM IST

హార్థిక్ పాండ్యా

క్రికెట్​లో హెలికాప్టర్ షాట్ అంటే గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ. అదే షాట్​ని ధోనీ ముందు మరో క్రికెటర్ ఆడితే ఎలా ఉంటుంది? బుధవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్​లో అదే జరిగింది.

ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ 20 ఓవర్లో నాలుగో బాల్.. బ్రావో వేసిన బంతిని హెలికాప్టర్ షాట్​తో స్టాండ్స్​లోకి పంపాడు హార్దిక్ పాండ్యా. వికెట్ కీపీంగ్ చేస్తున్న ధోనీ ముందు అలా సిక్స్ కొట్టడం తనకెంతో ప్రత్యేకమైందని అన్నాడీ ఆల్​రౌండర్.

హార్దిక్ పాండ్యా భారత జట్టులో ఆల్ రౌండర్​గా పేరు తెచ్చుకున్నాడు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్​లో చివర్లో బ్యాట్​కు పనిచెప్పాడు. 8 బంతుల్లో 25 పరుగులు చేసి ముంబయి జట్టు 170 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇవీ చూడండి..మలేసియా ఓపెన్​ నుంచి సైనా ఔట్


ABOUT THE AUTHOR

...view details