తెలంగాణ

telangana

ETV Bharat / sports

తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ - రసెల్

ట్రెంట్​బ్రిడ్జ్​లో జరుగుతున్న ప్రపంచకప్​ రెండో మ్యాచ్​లో పాక్ తడబడుతూ బ్యాటింగ్​ ప్రారంభించింది. ఓపెనర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. వెస్డిండీస్ బౌలర్లు షెల్డన్, రసెల్ తలో వికెట్ తీశారు.

తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్

By

Published : May 31, 2019, 3:44 PM IST

ప్రపంచకప్​ రెండో మ్యాచ్​లో పాకిస్థాన్- వెస్టిండీస్ తలపడ్డాయి. ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్​ ప్రారంభించిన పాకిస్థాన్​ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించింది. ఓపెనర్లు ఇమాముల్ హక్​ 2, ఫరక్ జమాన్ 22 పరుగులు చేసి వెనుదిరిగారు. షెల్డన్ కాట్రల్, ఆండ్రీ రసెల్ తలో వికెట్ తీశారు.

ప్రస్తుతం క్రీజులో బాబర్ ఆజమ్, హరీశ్ సొహైల్ ఉన్నారు. ఇరుజట్ల విజయంపై దృష్టి పెట్టిన ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details