న్యూజిలాండ్తో జరుగుతోన్న రెండో టెస్టులో పాకిస్థాన్ జట్టు తడబడుతూ ఆడుతుంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ల ఆటతీరుపై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాఠశాల స్థాయి ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేశారంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విధానాలేంటో వారు ఎంచుకున్న జట్టును చూస్తే అర్థమవుతుంది. జట్టులో బలహీనమైన ఆటగాళ్లను తీసుకున్నారు. వారి ప్రదర్శన కూడా బలహీనంగా ఉండగా.. మ్యాచ్ ఫలితాలూ అదే రకంగా వస్తున్నాయి. ఇటీవల జట్ల ఎంపికను గమనిస్తే.. అది పాఠశాల స్థాయి ఆటగాళ్లతో జట్టును కూర్పు చేశారా? అనే అనుమానం కలుగుతుంది. జట్టు యాజమాన్యం ఎప్పుడు మారుతుందా? అని అంటున్నారు. కానీ, మీరు ఎప్పుడూ మారతారు".
- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్