తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: పాక్- ఇంగ్లాండ్​ మ్యాచ్​లో రికార్డులు - ఇంగ్లండ్

ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​- పాకిస్థాన్ మ్యాచ్​ పలు రికార్డులకు వేదికైంది. ఈ టోర్నీలో తొలిసారిగా ఛేదనలో ఇద్దరు బ్యాట్స్​మెన్లు సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్​లో రెండు జట్లు చేసిన పరుగులు 682. ప్రపంచకప్​ టోర్నీలో ఇది రెండో అత్యధికం.. ఇలా మరెన్నో రికార్డులు బద్దలయ్యాయి.

పాక్-ఇంగ్లండ్​ మ్యాచ్​లో రికార్డులే రికార్డులు

By

Published : Jun 4, 2019, 11:00 AM IST

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో​ అనూహ్యంగా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్. వరుసగా 11 ఓటములు తర్వాత తొలి విజయం దక్కించుకుంది. స్వదేశంలో జరుగుతోన్న మ్యాచ్​, ఛేదనలో రూట్ (107), బట్లర్ (103) సెంచరీలు చేసినా గెలవలేకపోయింది ఇంగ్లాండ్. వీటితో పాటే మరిన్ని రికార్డులు ఈ మ్యాచ్​లో నమోదయ్యాయి.

  1. వన్డేల్లో వరుసగా 11 ఓటములు తర్వాత ఈ మ్యాచ్​లో పాకిస్థాన్ విజయం సాధించింది.
    పాకిస్థాన్ క్రికెట్ జట్టు
  2. ఇంగ్లాండ్ (334)- పాకిస్థాన్ (348).. కలిపి మ్యాచ్​లో 682 పరుగులు చేశాయి. ప్రపంచకప్​లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఇంతకు ముందు 2015 మార్చిలో ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్​లో మొత్తంగా 688 పరుగులు నమోదయ్యాయి.
  3. ఓ ప్రపంచకప్​ మ్యాచ్​లో రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగి అత్యధిక పరుగులు (334) చేసింది ఇంగ్లాండే.
  4. స్వదేశంలో దాదాపు 21 మ్యాచ్​ల తర్వాత లక్ష్యాన్ని ఛేదించలేక ఓ వన్డేలో ఓడిపోయింది ఇంగ్లీష్ జట్టు. 2015, సెప్టెంబర్​ 5 నుంచి అన్ని మ్యాచ్​ల్లోనూ టార్గెట్​ను ఛేదిస్తూ వచ్చింది.
  5. వన్డేల్లో వరుసగా 300 పైచిలుకు స్కోర్లు (ఆరు సార్లు) చేస్తూ ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2007లో ఆస్ట్రేలియా (6), 2019లో ఇంగ్లాండ్ (6), 2006లో శ్రీలంక (5), 2017లో టీమిండియా (5) చేసి ఈ జాబితాలో ఉన్నాయి.
    ఇంగ్లండ్ క్రికెటర్స్​
  6. ఓ వరల్డ్​కప్ మ్యాచ్​లో ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్లు సెంచరీలు చేయడమిదే తొలిసారి.
  7. ఓ ప్రపంచకప్​ మ్యాచ్​లో ఛేదనలో ఇద్దరూ క్రికెటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి.
  8. జాస్ బట్లర్ సెంచరీ.. ఈ మెగాటోర్నీ చరిత్రలో 9వ వేగవంతమైన శతకం. ప్రపంచకప్​ మ్యాచ్​లో ఇంగ్లండ్​ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
    జాస్ బట్లర్
  9. అత్యధిక వ్యవధి తర్వాత ప్రపంచకప్​ ఆడిన వాళ్లలో షోయాబ్ మాలిక్ రెండో వాడు. దాదాపు 12 సంవత్సరాల 74 రోజుల తర్వాత ఈ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్​ క్రికెటర్ అండర్సన్ కమిన్స్ 14 ఏళ్ల 362 రోజులతో ముందున్నాడు.
    షోయాబ్ మాలిక్

ABOUT THE AUTHOR

...view details