తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​లో ఆసియా కప్.. భారత్​ పాల్గొంటుందా?

వచ్చే ఏడాది ఆసియా కప్​ టోర్నీ పాకిస్థాన్​లో జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు ఆ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. యూఏఈ వేదికగా జరిగిన గత ఆసియా కప్​ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది.

పాకిస్థాన్​లో ఆసియా కప్.. భారత్​ పాల్గొంటుందా?

By

Published : May 29, 2019, 11:29 PM IST

2020లో జరగనున్న ఆసియా కప్​నకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్​తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ ఆ టోర్నీలో​ పాల్గొంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. సింగపూర్ వేదికగా బుధవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఆసియా కప్​ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకున్నారు.

ఆసియా దేశాల మధ్య ప్రతి రెండేళ్లకు ఓసారి జరిగే ఈ ఆసియా కప్‌ టోర్నీ... గతేడాది యూఏఈ వేదికగా జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ 15వది. ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఆసియాకప్‌ను ముందుగా నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఆసియా కప్​ టోర్నీలో టీమిండియా ఏడు సార్లు విజేతగా నిలిచింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

ఇది చదవండి: WC 19: ప్రపంచకప్​ వేదికలు... వాటి సామర్థ్యాలు

ABOUT THE AUTHOR

...view details