తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక తొలి టీ20 ప్రపంచ కప్​కు ఏడేళ్లు

2014 ఏప్రిల్ 6న శ్రీలంక తన తొలి టీ20 ప్రపంచకప్​ను అందుకుంది. ఫైనల్లో టీమ్​ఇండియాను 6 వికెట్ల తేడాతో ఓడించిన లంక.. పొట్టి కప్​ను ముద్దాడింది. కుమార సంగక్కర హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇది జరిగి నేటికి సరిగా ఏడేళ్లు అవుతున్న సందర్భంగా నాటి మ్యాచ్​ విశేషాలు మరోసారి మీకోసం.

On this day in 2014: SL defeated India to lift its first T20 WC title
శ్రీలంక తొలి టీ20 ప్రపంచకప్​కు ఏడేళ్లు

By

Published : Apr 6, 2021, 10:06 AM IST

సరిగా ఏడేళ్ల క్రితం ఇదే రోజున శ్రీలంక జట్టు పొట్టి ప్రపంచకప్​ను కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్​లో ఇదే ఆ జట్టుకు తొలి వరల్డ్​కప్​. టీ20 కప్ గెలిచి ఏడేళ్లు అవుతున్న సందర్భంగా ఐసీసీ ట్విట్టర్​లో నాటి మ్యాచ్​ వీడియోను షేర్​ చేసింది. ఐసీసీ ట్వీట్​ను శ్రీలంక క్రికెట్ బోర్డు రీట్వీట్ చేసింది.

ఢాకాలోని షేర్​ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆదిలోనే రహానె వికెట్​ కోల్పోయిన భారత్​ను.. రోహిత్, విరాట్ జోడీ ఆదుకుంది. రెండో వికెట్​కు 60 రన్స్​ జోడించింది. తర్వాత 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్​ ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్​.. జిడ్డు ఇన్నింగ్స్​ ఆడాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశాడు. దీంతో భారత్​ రన్​రేట్ దారుణంగా పడిపోయింది. కోహ్లీ 77 పరుగులు తీసినప్పటికీ టీమ్ఇండియా కేవలం 130 పరుగులే చేయగలిగింది. యువీ బ్యాటింగ్​పై చాలా విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్​తో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు యువీ.

ఇదీ చదవండి:ఈ నెల 21న స్టార్​ షూటర్​ నారంగ్​ వివాహం

అనంతరం బరిలోకి దిగిన లంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓ దశలో 78 కే 4 వికెట్లు కోల్పోయిన లంకను.. కుమార సంగక్కర హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. జయవర్ధనే(24), తిసారా పెరీరా(23) ఆకట్టుకున్నారు.

ఈ ఏడాది పొట్టి వరల్డ్​కప్​కు భారత్​ ఆతిథ్యమివ్వనుంది.

ఇదీ చదవండి:టోక్యో ఒలింపిక్స్​కు ఉత్తర కొరియా దూరం!

ABOUT THE AUTHOR

...view details