న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ సాటర్త్వైట్ తల్లికాబోతుంది. అదే జట్టుకు చెందిన సీనియర్ బౌలర్ లే తహుహూను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీ.. వచ్చే ఏడాది జనవరి కల్లా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. గర్భం దృష్ట్యా క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకోనుంది.
లే తహుహూ - అమీ సాటర్త్వైట్.. ఇద్దరూ కట్టుబాట్లను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా ఒక్కటైన తొలి మహిళా క్రికెట్ జంటగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం బేబీ శాటర్హుహూ 2020లో రాబోతుంది అని ఇన్ స్టాలో పంచుకుంది అమీ.అయితే ఏ విధానంలో తల్లి కాబోతుందో చెప్పలేదు.
"నేను, లే ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు తహతహలాడుతున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో మాకో బిడ్డ పుట్టబోతుంది. మా జీవితంలో ఇది మాకు ఎంతో ప్రత్యేకమైన సమయం. ఈ అద్భుత ఘట్టంకోసం ఎదురుచూస్తున్నాం. -అమీ సాటర్త్వైట్, కివీస్ మహిళా జట్టు కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తనకు మాతృత్వ సెలవుల ఇచ్చిందని అమీ తెలిపింది.