తెలంగాణ

telangana

By

Published : May 25, 2019, 6:15 AM IST

ETV Bharat / sports

కివీస్​తో ప్రాక్టీస్​ మ్యాచ్​... నాలుగో స్థానం ఎవరిది..?

ప్రపంచకప్​లో రాణించేందుకు సన్నద్ధమవుతోంది టీమిండియా. ఓవల్ వేదికగా న్యూజిలాండ్​తో నేడు వార్మప్ మ్యాచ్​ ఆడనుంది​. ఇంగ్లండ్​ పిచ్​లపై విరాట్​ సేన ఎలా ఆడుతుంది, నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్​కు దిగుతారు అనేది ఈ మ్యాచ్​లో తెలియనుంది.

భారత్ వార్మప్ మ్యాచ్.. నాలుగో స్థానం ఎవరిది..?

ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్​లో అడుగు పెట్టింది టీమిండియా. టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్​లు ఆడనుంది. ఇందులో భాగంగానే ఓవల్​లోశనివారం న్యూజిలాండ్​తో తలపడనుంది.

ఈ మ్యాచ్​లో గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని భారత క్రికెట్ జట్టు భావిస్తోంది. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న నాలుగో స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి. తొలిసారి ప్రపంచకప్​ ఆడుతున్న కుర్రాళ్లు ఏ మేరకు రాణిస్తారో.

న్యూజిలాండ్ జట్టులో టేలర్, విలియమ్సన్ బ్యాట్​తో ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అస్త్రాలు సంధించేందుకు బౌలర్లు తయారుగా ఉన్నారు.

భారత్- న్యూజిలాండ్ జట్లు

జట్లు

భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోని, చాహల్, కుల్​దీప్, బుమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్, కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్, రవీంద్ర జడేజా

న్యూజిలాండ్: విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, బౌల్ట్, గ్రాండ్​హమ్, ఫెర్గ్యూసన్, గప్తిల్, మ్యాచ్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మన్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోలస్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, రాస్ టేలర్

ABOUT THE AUTHOR

...view details