తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏదేమైనా మా కెప్టెన్​ కోహ్లీనే: మైక్​ హెసన్​ - mike hesson

ఐపీఎల్​లో బెంగళూరు కెప్టెన్​గా విరాట్​ను కాకుండా వేరొకరిని అనుకోలేదని చెప్పాడు ఆ జట్టు డైరెక్టర్ మైక్ హెసన్. దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడి ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తానని చెప్పాడు.

విరాట్

By

Published : Sep 19, 2019, 7:55 PM IST

Updated : Oct 1, 2019, 6:16 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త డైరెక్టర్ మైక్ హెసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతోబుధవారం జరిగిన మ్యాచ్​లో అతడు అద్భుతంగా ఆడాడని అన్నాడు. విరాట్ గొప్ప సారథి అని, ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో(ఐపీఎల్)​లో ఆర్​సీబీ కెప్టెన్​గా తనను తొలగించే అవకాశమే లేదని చెప్పాడు.

"కోహ్లీ ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తా. పెర్త్​లోగత ఏడాది జరిగిన టెస్టులో విరాట్ శతకం అద్భుతం. నాకు నచ్చిన వాటిలో ముందువరుసలో ఉంటుందా సెంచరీ. క్రికెటర్​గానే కాకుండా టీమిండియా కెప్టెన్​గానూ అతడిని గౌరవిస్తా" --మైక్ హెసన్, ఆర్​సీబీ డైరెక్టర్​

బెంగళూరు కెప్టెన్​గా విరాట్​ను కాకుండా మరో పేరే అనుకోలేదని.. ఇందులో సందేహం అవసరం లేదని చెప్పాడు మైక్​.

"ఆర్​సీబీ కెప్టెన్​గా విరాటే ఉంటాడు. అతడిని మార్చే ఉద్దేశం లేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా కోహ్లీ ముందుకు వెళ్లాలి. నా సలహాలు తీసుకునేందుకు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా" --మైక్ హెసన్, ఆర్​సీబీ డైరెక్టర్

విరాట్, డివిలియర్స్​ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిందిఆర్​సీబీ. ఈ కారణంగా జట్టులో కీలక మార్పులపై దృష్టి పెట్టాడు మైక్ హెసన్. నిర్ధుష్టమైన ఆటగాళ్లనే ఎంచుకోవాలని, దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా వేలంలో వారిని కొనుగోలు చేయాలని సూచించాడు.

ఇదీ చదవండి: బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు రికార్డు

Last Updated : Oct 1, 2019, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details