తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​ గెలవడం.. 150 కోట్ల మంది కోరిక' - ప్రపంచకప్​ 2019

ప్రపంచకప్​లో టీమిండియా తరఫున ఆకట్టుకుంటున్నాడు హార్దిక్ పాండ్య. కప్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. తనపై ఒత్తిడేమి లేదని స్పష్టం చేశాడు.

'ప్రపంచకప్​ గెలవడం.. 150 కోట్ల మంది కోరిక'

By

Published : Jun 14, 2019, 5:09 AM IST

ప్రపంచకప్​లో పాల్గొంటున్న తనపై ఒత్తిడి లేదని అంటున్నాడు టీమిండియా క్రికెటర్​ హార్దిక్ పాండ్య. ఏ పరిస్థితుల్లోనైనా తాను సంతోషంగా ఉంటానని చెప్పాడు. ప్రపంచకప్​ను టీమిండియా గెలవాలన్నది 150 కోట్ల మంది కోరికని, అందుకే అదనపు ఒత్తిడి లేదని అన్నాడు.

‘కేవలం 150 కోట్ల మందికే మాపై అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడేమీ లేదు. జులై 14న నా చేతుల్లో ట్రోఫీ ఉండాలి. అంతే! దాని గురించి నా ఆలోచన. ప్రపంచకప్‌ గెలవడమే నా ప్రణాళిక. భారత్‌కు ఆడటమే నాకన్నీ. ఇదే నా జీవితం. మూడున్నరేళ్లుగా దీనికోసమే శ్రమించాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది’ -హార్దిక్ పాండ్య, టీమిండియా ఆల్​రౌండర్

తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన అనుభవాల్ని వెల్లడించాడు ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య

‘నేనెప్పుడు సంతోషంగా, ఆనందంగానే ఉంటాను. కొద్ది రోజుల క్రితం నా మిత్రుడు 2011 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు మేం సంబరాలు చేసుకుంటున్న చిత్రాన్ని పంపాడు. ఆ ఫొటో చూసి ఎంతో భావోద్వేగం చెందాను. అప్పుడు అభిమానిగా ఉన్న నేను ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత 2019 ప్రపంచకప్‌ ఆడుతున్నాను. ఇదో అందమైన కల’ -హార్దిక్ పాండ్య, టీమిండియా ఆల్​రౌండర్

ఇది చదవండి: క్రికెట్ ప్రపంచకప్​ ఫైనల్​పై 'పిచాయ్ జోస్యం'

ABOUT THE AUTHOR

...view details