తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూడో టెస్టులో తప్పు మాదే: ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ - క్రికెట్ న్యూస్

మూడో టెస్టులో తమ అంచనా తప్పిందని ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ చెప్పాడు. బంతి అంతలా తిరుగుతుందని ఊహించలేదని అన్నాడు.

No comparison between Dom Bess and me, he is a far more talented bowler: Joe Root
మూడో టెస్టులో తప్పు మాదే: ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్

By

Published : Mar 3, 2021, 1:04 PM IST

మొతేరాలో జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ వివరించాడు. పింక్‌బాల్‌ పోరులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా వేశామని అంగీకరించాడు. మీడియాతో బుధవారం మాట్లాడిన రూట్‌.. నాలుగో టెస్టులో యువ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ను తుది జట్టులోకి తీసుకుంటామని అన్నాడు.

'మూడో టెస్టులాగే ఇప్పుడు కూడా పిచ్‌ అలాగే ఉంటే.. అవకాశం కోసం డామ్‌ బెస్‌ ఎదురుచూస్తుంటాడు. నాలుగో టెస్టు తుది జాబితాలో అతడు కచ్చితంగా ఉంటాడు. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆరాట పడుతున్నాడు. గత టెస్టులో నా ఆట చూసి అతడెంతో ఉత్సుకతకు గురై ఉంటాడు. అలాగే నాకూ అతడికి పోలికలే లేవు. అతడు నా కన్నా ఎంతో నైపుణ్యం గల స్పిన్నర్‌' అని రూట్‌ వివరించాడు.

ఇంగ్లాండ్ జట్టు

'పింక్‌బాల్‌ టెస్టులో మా జట్టు ఎంపికలో తప్పు జరిగింది. పిచ్‌ను అంచనా వేయలేకపోయాం. గతంలో భారత్‌లో జరిగిన పింక్‌బాల్‌ టెస్టు పరిస్థితులను బట్టి, అక్కడ బంతి ఎలా స్పందించిందనే విషయాల పైనే ఈ మ్యాచ్‌లో తుది జట్టును ఎంపిక చేశాం. కానీ, బంతి ఇలా తిరుగుతుందని ఊహించలేదు' అని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అసలు విషయం వెల్లడించాడు.

నాలుగో టెస్టుకు ముందు మొతేరా పిచ్‌పై వ్యంగ్యంగా ఓ ఫొటో పంచుకున్న ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌వాన్‌కు టీమ్‌ఇండియా అభిమానులు దీటుగా జవాబిచ్చారు. వాన్‌ ఓ మట్టి కుప్పలో బ్యాటింగ్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాలో ఫొటో పంచుకొని.. 'నాలుగో టెస్టుకు బాగా సన్నద్ధమౌతున్నా'నని పోస్టు చేశాడు. దీనికి స్పందించిన నెటిజెన్లు.. 'నువ్వెప్పుడూ ఏడుస్తూనే ఉండు' అని కామెంట్లు పెడుతున్నారు. పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా గెలుపొందినప్పటి నుంచి వాన్‌ ఆ పిచ్‌పై విమర్శలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలా చేసి నవ్వులపాలయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details