శ్రీలంకతో జరుగుతున్న ప్రపంచకప్ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కార్డిఫ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశముంది. ప్రపంచకప్‌లో కివీస్‌పై శ్రీలంకకు మంచి రికార్డు ఉంది.
ఇరుజట్లు మెగాటోర్నీలో పది సార్లు తలపడ్డాయి. లంకేయులు ఆరుసార్లు గెలవగా, కివీస్ నాలుగుసార్లు విజయం సాధించింది. అయితే ప్రస్తుత శ్రీలంక జట్టు ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. ఈ ఏడాది 9 వన్డేలు ఆడితే ఒక్కదాంట్లో మాత్రమే నెగ్గింది.
మరోవైపు విలియమ్సన్, గప్తిల్, మన్రో, టేలర్లతో కివీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో బౌల్ట్, సౌథీ, ఇష్ సోధి లాంటి ఆటగాళ్లున్నారు. శ్రీలంకలో కరుణరత్నె, మాథ్యూస్, తిరిమన్నే, మలింగ, కుశాల్ పెరీరా ముఖ్య పాత్ర పోషించనున్నారు.
జట్లు..