తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్ క్రీడాస్ఫూర్తికి అరుదైన గౌరవం - worldcup mcc

ఎమ్​సీసీ క్రిస్టోఫర్ మార్టిన్ జెన్​కిన్స్​ స్పిరిట్ ఆఫ్ క్రికెట్-2019 పురస్కారం న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో వారు చూపిన క్రీడాస్ఫూర్తికి ఈ పురస్కారం లభించింది.

New Zealand Win MCC's Spirit Of Cricket Award For Conduct In World Cup Final
విలియమ్సన్​

By

Published : Dec 3, 2019, 7:51 PM IST

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు అరుదైన గౌరవం లభించింది. 2019 ప్రపంచకప్​లో క్రీడా స్ఫూర్తీతో ఆడినందుకు గాను మారీల్​బోన్​ క్రికెట్ క్లబ్​(ఎమ్​సీసీ) క్రిస్టోఫర్ మార్టిన్ జెన్​కిన్స్​ స్పిరిట్ ఆఫ్ క్రికెట్-2019 పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎమ్​సీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర తెలియజేశాడు.

"న్యూజిలాండ్ ఈ అవార్డుకు అర్హతగల జట్టు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్​లో ఓడినప్పటికీ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించారు కివీస్ ఆటగాళ్లు. టోర్నీ ఆద్యంతం వారు అలాగే ప్రవర్తించారు. తుదిపోరులో వారు చూపిన అణకువ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం" -కుమార సంగక్కర, ఎమ్​సీసీ అధ్యక్షుడు

జులై 14న లార్డ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో కివీస్ జట్టు ఎంతో ఉదారంగా వ్యవహరించింది. ముఖ్యంగా కెప్టెన్ విలయమ్సన్ తమ జట్టు ఓడినప్పటికీ క్రీడాస్ఫూర్తి, అణకువతో హుందాగా ప్రవర్తించాడు.

విలియమ్సన్​

ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే సూపర్ ఓవర్ నిర్వహించగా అందులోనూ స్కోర్లు సమమయ్యాయి. బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లీష్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు.

ఇదీ చదవండి: 1500 మీటర్ల పరుగులో భారత్​కు ​ 4 మెడల్స్​

ABOUT THE AUTHOR

...view details