క్రికెట్లో ఒక్కోసారి ఆసక్తికర సంఘటనలు చూస్తుంటాం. శనివారం న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డేలో ఇలాంటి ఓ దృశ్యం కనువిందు చేసింది. అసలు జట్టులోలేని సభ్యుడు కివీస్ జెర్సీలో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు.
ఎవరా ఆటగాడు..?
ఎవరైనా ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌గా తుది జట్టులో లేని ఆటగాళ్లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తారు. ఆ వెసులుబాటు ఎప్పట్నుంచో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం కివీస్ జట్టు అసిస్టెంట్ కోచ్ ల్యూక్ రోంచి ఈ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ జట్టులోని ఎక్స్ట్రా ప్లేయర్లు స్కాట్ కగ్గిలిన్, మిచెల్ సాంటర్న్ అనారోగ్యంతో బాధపడటమే కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఆటగాళ్లకు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ వంటి విభాగాలకు ప్రత్యేకంగా కోచ్‌లు ఉంటారు. ప్రధాన కోచ్‌తో పాటు ఆటగాళ్ల తర్ఫీదులో అసిస్టెంట్ కోచ్‌లు కీలకం. అయితే ఒక్కోసారి మ్యాచ్‌లో ఆటగాళ్లు గాయపడితే వీళ్లూ ఫీల్డింగ్ చేయొచ్చని ఐసీసీ నియమం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌కు అవకాశం ఉండదు.