తెలంగాణ

telangana

ETV Bharat / sports

న్యూజిలాండ్​ అభిమాని నోట 'భారత్ మాతా కీ జై' - new zealand vs india 2020

భారత్-కివీస్ మధ్య​ జరిగిన రెండో టీ20లో ఓ న్యూజిలాండ్​ దేశస్థుడు 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

న్యూజిలాండ్​ అభిమాని నోట 'భారత్ మాతా కీ జై'
న్యూజిలాండ్​ అభిమాని

By

Published : Jan 29, 2020, 3:10 PM IST

Updated : Feb 28, 2020, 10:02 AM IST

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్​లో 2-0 ఆధిక్యం సాధించి, మూడో మ్యాచ్ ఆడుతుంది. హామిల్టన్​లో ఇది జరుగుతుంది. అంతకు ముందు జరిగిన మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ఆ వీడియోలో ఏముంది?

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​ల్లోని మైదానంలో ఆటగాళ్ల మధ్య, అభిమానుల మధ్య గంభీర వాతావరణం ఉంటుంది. భారత్-న్యూజిలాండ్​ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ మధ్య మాత్రం అలాంటి పరిస్థితులేం లేవు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 జరుగుతుండగా, టీమిండియాకు చెందిన ఓ అభిమాని.. 'భారత్​ మాతా కీ జై' అంటూ అరిచాడు. తన ముందు వరుసలో ఉన్న న్యూజిలాండ్​ దేశస్థుడికి ఇది నేర్పించి, ఈ నినాదం చేయించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో నెటిజన్ల మనసు గెల్చుకుంటోంది.

భారత్-న్యూజిలాండ్​ మధ్య ఈ పర్యటనలో భాగంగా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరగనున్నాయి.

Last Updated : Feb 28, 2020, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details