విదేశీ కోచ్‌లతో పోలిస్తే భారత పరిస్థితులు, వాతావరణం, ఆటగాళ్ల గురించిన విషయాలపై భారత కోచ్‌లకు మంచి పరిజ్ఞానం ఉంటుందని.. వారిని ఐపీఎల్‌లో ఉపయోగించుకోకపోవడం బాధాకరమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
"మనకు ఎంతోమంది అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన కోచ్‌లు ఉన్నారు. ఇలాంటి వారికి ఐపీఎల్‌లో కనీసం సహాయక కోచ్‌లుగా అవకాశం రాకపోవడం బాధాకరం. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లే ఎక్కువ. ప్రతి జట్టులో కనీసం 17-18 మంది మన ఆటగాళ్లే ఉంటారు. వారి గురించి స్థానిక ఆటగాళ్లకు మంచి అవగాహన ఉంటుంది. భారత కోచ్‌లను ఉపయోగించుకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు లబ్ధి పొందాయి. సహాయక కోచ్‌ల ప్రతిభనూ వాడుకోవాలి. ఈ చిన్న విషయాన్ని గుర్తించడంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు విఫలం అవుతున్నాయి."
-రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) అధ్యక్షుడు
ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రీడాకారుల వేలం బెంగళూరు నుంచి కోల్‌కతాకు మార్చింది ఐపీఎల్ కమిటీ. డిసెంబరు 19న ఈ కార్యక్రమం జరగనుంది. ఐపీఎల్ 2019 కోసం ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.82కోట్లు కేటాయించగా.. 2020నాటికి ఒక్కో జట్టుకు రూ.85 కోట్లు కేటాయించారు. గత వేలంలో ఫ్రాంఛైజీల వద్ద మిగిలి పోయిన సొమ్ముతో పాటు ఈ మూడు కోట్లు అదనంగా అందివ్వాలని నిర్ణయించారు.
ఫ్రాంఛైజీలకు మిగిలి ఉన్న నిధులు
చెన్నై సూపర్ కింగ్స్-రూ.3.2కోట్లు, దిల్లీ క్యాపిటల్స్-రూ.7.7 కోట్లు, కింగ్స్ XI పంజాబ్-రూ.3.7 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్-రూ.6.05 కోట్లు, ముంబయి ఇండియన్స్-రూ.3.5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్-రూ. 7.15 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రూ.1.80 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్-రూ.5.30 కోట్లు.
ఇవీ చూడండి:ఆటగాళ్లను వదులుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు