తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీకి ఇంకా పరుగుల దాహం తీరలేదు' - కోహ్లీ విలియమ్సన్​ లేటెస్ట్​ న్యూస్​

కోహ్లీపై ప్రశంసలు కురిపించిన​ కివీస్ కెప్టెన్​​ విలియమ్సన్​.. అతడి పరుగుల దాహం ఇప్పటికీ తీరలేదని అన్నాడు. అయితే విరాట్​తో కలిసి ఆడటం తన అదృష్టమని చెప్పాడు.

Virat Kohli has married his ability to hunger and drive, says Kane Williamson
'కోహ్లీతో క్రికెట్​ ఆడటం నా అదృష్టం'

By

Published : Jun 8, 2020, 7:38 PM IST

ప్రస్తుత క్రికెటర్లతో పోలిస్తే టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అత్యుత్తమమని చెప్పాడు న్యూజిలాండ్​ సారథి​ కేన్​ విలియమ్సన్​. తామిద్దరూ స్నేహితులుగా మారడం, తన అదృష్టంగా భావిస్తున్నట్లు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"అంతర్జాతీయ క్రికెట్​లో అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా గుర్తింపు తెచ్చుకునేందుకు కోహ్లీకి కొంత సమయమే పట్టింది. ప్రస్తుతం అతడి అనేక రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికీ కోహ్లీకి పరుగుల దాహం తీరలేదు. మరోవైపు తనకున్న పరిణితితో కెరీర్​లో మంచి నిర్ణయాలను తీసుకుంటున్నాడు. అది అతనికి సహజ సిద్ధంగా వచ్చిందే అయినా తనను తాను కొత్తగా మార్చుకునేందుకు ప్రతిరోజు కష్టపడుతుంటాడు. అలాంటి క్రికెటర్​తో కలిసి ఆడటం నిజంగా నా అదృష్టం. చిన్న వయసులోనే కోహ్లీని కలవడం, అతడి పురోగతిని, ప్రయాణాన్ని చూస్తూ రావడం చాలా బాగుంది"

- కేన్​ విలియమ్సన్​, న్యూజిలాండ్​ కెప్టెన్

విరాట్​ క్లోహీ, కేన్​ విలియమ్సన్​

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్‌ కోహ్లీ అంటే ప్రత్యేకమైన అభిమానమని విలియమ్సన్​ ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాము మంచి స్నేహితులమని.. అభిరుచులు, ఆలోచనలూ ఒకటేనని వెల్లడించాడు. అయితే విరాట్‌ నుంచి ఓ నైపుణ్యాన్ని తీసుకునే అవకాశం వస్తే ఏది ఎంచుకుంటారని అడగ్గా.. కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసేసుకుంటానని నవ్వుతూ చెప్పాడు విలియమ్సన్‌.​

ఇదీ చూడండి... ఈ దిగ్గజాల కోరిక తీరలేదు.. కల నెరవేరలేదు!

ABOUT THE AUTHOR

...view details