తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో వారు చేస్తోన్న నిరంతరాయ కృషే ఇందుకు నిదర్శనం. నేడు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు భారత క్రికెటర్లు వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో వృత్తి పట్ల వారు చూపుతున్న నిబద్ధత, అంకితభావం, త్యాగం, సాహసానికి సలాం కొట్టారు. వీరిలో కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తదితరులు ఉన్నారు.
వైద్యుల సేవలకు భారత క్రికెటర్లు సలాం - క్రికెట్ వార్తలు
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత క్రికెటర్లు వారికి సలాం కొట్టారు. కరోనాపై పోరులో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను రక్షిస్తున్నారని ప్రశంసించారు.
భారత క్రికెటర్లు
"ఈ ఒక్క రోజే కాదు ప్రతిరోజు వైద్యుల త్యాగం, సాహసాలను మనం స్మరించుకోవాలి. ఎంతో మంది దేశప్రజలకు నిబద్ధతతో వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ సేవా స్ఫూర్తికి, అంకితభావానికి సలాం"
-కోహ్లీ, టీమ్ఇండియా సారథి
Last Updated : Jul 1, 2020, 6:23 PM IST