టీమ్ఇండియా యువబౌలర్ నటరాజన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా, షమి వంటి బౌలర్లు లేకపోయినా ఒత్తిడిలోనూ నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని తెలిపాడు. బౌలింగ్‌లో ఇలానే నిలకడ కొనసాగిస్తే.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కించుకుంటాడని అభిప్రాయపడ్డాడు.
"నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బుమ్రా, షమి లేకపోయినా.. ఒత్తిడిలోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అతడు అంతర్జాతీయ స్థాయిలోనే తన తొలి మ్యాచ్ ఆడడం విశేషం. నటరాజన్ కష్టపడే తత్వంతో పాటు వినమ్రతతో ఉంటాడు. జట్టులో ఒక లెఫ్టార్మ్ పేసర్ ఉండడం టీమ్‌కు కలిసొచ్చే అంశం. ఆటలో ఇలాంటి నిలకడతోనే ఉంటే వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో అతడు భాగమయ్యే అవకాశం ఉంది. అతడే కీలకంగానూ ఉంటాడు".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
మనసు చాటుకున్న హార్దిక్..
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'కు ఎంపికయ్యాడు. అయితే ఈ అవార్డుకు బౌలర్ నటరాజన్ సరైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' ట్రోఫీని నటరాజన్‌కు అందజేసి.. హార్దిక్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.