వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఇప్పటికే నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించిది. ఇప్పుడు నమీబియా.. ఆ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుంది. ఒమన్తోమంగళవారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఈ మెగాటోర్నీకి క్వాలిఫై అయింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది నమీబియా. ఆల్‌రౌండర్ జేజే స్మిత్ 25 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 162 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన ఒమన్.. 107 పరుగులకే ఆలౌట్ అయింది. ఇటీవలే ఐర్లాండ్, పుపువా న్యూగినియా జట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.