ఐపీఎల్ 14వ సీజన్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్. దీనిని ప్రఖ్యాత డిజైనర్ జంట శాంతన్-నిఖిల్రూపొందించింది. తాము సాధించిన టైటిళ్ల సంఖ్య(5).. విశ్వంలోని పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం మా జెర్సీలో ప్రతిబింబిస్తాయని ముంబయి తెలిపింది. "ఒక టీమ్.. ఒక ఫ్యామిలీ.. ఒక జెర్సీ" అని ట్విట్టర్లో పేర్కొంది.
ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ కొత్త జెర్సీ ఇదే
ఐపీఎల్ కోసం నూతన జెర్సీని ఆవిష్కరించింది ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ కొత్త జెర్సీ ఇదే
"ముంబయి ఇండియన్స్ ప్రతి ఏడాది విలువలు, భావజాలంపై నిర్మించిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మేము సాధించిన ఐదు ట్రోఫీలు ఈ పంచ భూతాలకు సమానం. ఈ విషయాన్ని జెర్సీ రూపంలో తీసుకొచ్చాం. ప్రతి ఏడాది జెర్సీల రూపకల్పనలో మాకు పలు ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అంశం ఆటగాళ్లతో పాటు అభిమానులకు గౌరవ ప్రదమైన విషయం" అని ముంబయి ఇండియన్స్ ప్రతినిధి తెలిపారు.