తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ తిట్లు బాగా పని చేశాయి: దీపక్ - MS Dhoni's Scolding

టీమిండియా మాజీ సారథి ధోనీ ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయని అంటున్నాడు యువ బౌలర్ దీపక్ చాహర్. మరికొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

సీఎస్​కే

By

Published : Nov 13, 2019, 6:56 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన మూడో టీ20లో హ్యాట్రిక్​ తీసి రికార్డు సృష్టించాడు టీమిండియా యువ బౌలర్ దీపక్ చాహర్. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​కు ఆడిన చాహర్​.. ధోనీ మద్దతు గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించాడు.

"క్రెడిట్ మొత్తం ఐపీఎల్‌దే. చెన్నై సూపర్‌కింగ్స్‌, ధోనీ భాయ్‌ నుంచి నేనెంతో నేర్చుకున్నా. బ్యాట్స్‌మన్‌ను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకున్నా.

"ఒక మ్యాచ్‌లో నేను బౌలింగ్ చేయాల్సిన బ్యాట్స్‌మన్‌లకు సంబంధించిన వీడియోలను చూడటం నాకు అలవాటు. ఇదే నా బౌలింగ్‌ సామర్థ్యాన్ని పెంచింది. కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది."

"రెండేళ్లకు పైగా ధోనీ నాయకత్వంలో ఆడుతున్నా. మైదానంలో నన్ను తిడుతూనే, సూచనలూ ఇచ్చేవాడు. ఈ సంఘటల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నా. వికెట్ల వెనక నుంచి మహీభాయ్‌ గమనిస్తాడు. కొన్నిసార్లు బంతివేసే ముందు ధోనీ సలహాలు పాటించడం వల్ల వికెట్లు దక్కేవి."

"డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. ధోనీ భాయ్ నుంచి నేను నేర్చుకున్న ప్రతి విషయం అంతర్జాతీయ స్థాయిలో నాకు చాలా ఉపయోగపడుతున్నాయి."

ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన మూడో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు దీపక్ చాహర్. మొత్తం ఆరు వికెట్లు ఖాతాలో వేసుకుని టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు(6/7) నమోదు చేశాడీ టీమిండియా యువ బౌలర్. అంతర్జాతీయ టీ20లో హ్యాట్రిక్ తీసిన రెండో భారత క్రికెటర్​గానూ రికార్డు సృష్టించాడు. మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

ఇవీ చూడండి. నికోలస్ పూరన్​పై నాలుగు మ్యాచ్​ల నిషేధం

ABOUT THE AUTHOR

...view details