తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత జట్టు విలువైన ఆస్తి ధోనీ: జాఫర్

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు చాలా విలువైన ఆటగాడని తెలిపాడు వసీం జాఫర్. ఫిట్​నెస్, ఫామ్​లో ఉంటే అతడిని మించి చూడాల్సిన పని లేదని అన్నాడు.

జాఫర్
జాఫర్

By

Published : Mar 19, 2020, 11:11 AM IST

మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ టీమ్‌ఇండియాకు విలువైన ఆస్తి అని మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన జాఫర్‌ ట్విట్టర్‌లో ధోనీపై స్పందించాడు.

"ధోనీ ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్‌లో ఉంటే మనం అతడిని మించి చూడాల్సిన పనిలేదు. వికెట్ల వెనుక, లోయర్‌ ఆర్డర్‌లో అతను ఎంతో విలువైన ఆటగాడు. ధోనీని ఆడిస్తే కేఎల్‌ రాహుల్‌పై భారం తగ్గుతుంది. అలాగే రిషభ్‌ పంత్‌ను కూడా లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌గా టీమ్‌ఇండియా ఉపయోగించుకోవచ్చు."

-జాఫర్‌, టీమిండియా మాజీ క్రికెటర్

ధోనీ చివరిసారి గతేడాది వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌తో తలపడిన సెమీస్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో జట్టు ఓటమిపాలవ్వడం వల్ల అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లతో సాధన మొదలుపెట్టినా.. కరోనా వైరస్‌(కొవిడ్‌ 19) కారణంగా అది కూడా నిలిచిపోయింది. దీంతో చెన్నై నుంచి రాంచీకి చేరిన ధోనీ అక్కడ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నాడు. ఇష్టమొచ్చిన పనులు చేసుకుంటూ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. జాఫర్‌ టీమ్‌ఇండియా తరఫున 31 టెస్టులు ఆడగా 5 శతకాలు, 11 అర్ధశతకాలతో మొత్తం 1944 పరుగులు చేశాడు.

ధోనీ

ABOUT THE AUTHOR

...view details