తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2021, 5:51 PM IST

ETV Bharat / sports

ఇండియా- ఇంగ్లాండ్​ చివరి టెస్టుకు బ్యాటింగ్​ పిచ్​!

మొతేరా పిచ్​పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తదుపరి మ్యాచ్​కు బ్యాటింగ్​కు అనుకూలించేలా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్​ జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ.. ఐసీసీ దృష్టిలో పడకుండా.. బీసీసీఐ ఈ మార్పులు చేయొచ్చు.

Motera likely to escape ICC 'Red Eye' as final Test pitch promises to be batting beauty
ఇండియా-ఇంగ్లాండ్​ నాల్గో టెస్టుకు బ్యాటింగ్​ పిచ్​!

రెండ్రోజుల్లోనే పింక్​ టెస్టు ముగిసిన నేపథ్యంలో మొతేరా పిచ్​పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐసీసీపైనా క్రికెట్​ మాజీలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాల్గో టెస్టుకు బ్యాటింగ్​కు అనుకూలంగా వికెట్​​ను మార్చే అవకాశం ఉంది. ఈ చివరి టెస్టు కూడా మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది.

ఒక స్టేడియంలోని పిచ్‌లు వేర్వేరు రకాలుగా స్పందించినప్పుడు ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలోనే.. బ్యాటింగ్​ పిచ్​ రూపొందించాలన్న నిర్ణయం ఉపకరిస్తుందని బీసీసీఐ భావిస్తోంది.

"తదుపరి టెస్టుకు గట్టి ఉపరితలం ఉన్న వికెట్​ను రూపొందించే అవకాశం ఉంది. తిరిగి సంప్రదాయ ఎరుపు బంతితో మ్యాచ్​ జరగనుంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టులో భారీ స్కోర్లు నమోదవ్వొచ్చు. ఒకే వేదికపై భిన్న ఫలితాలు వచ్చినప్పుడు ఐసీసీ చర్యలకు పాల్పడే అవకాశాలు తక్కువ. అది కూడా మ్యాచ్​ రిఫరీ శ్రీనాథ్​ ఇచ్చే రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. అందుకే పిచ్​ను బ్యాటింగ్​కు అనుకూలించేలా తయారు చేయొచ్చు."

-బీసీసీఐ అధికారి.

ప్రస్తుతానికి మొతేరా వికెట్​కు సంబంధించి ఇంగ్లాండ్​ ఇప్పటివరకైతే ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

''చాలా మంది ఇంగ్లీష్​ మాజీలు పిచ్​ గురించి విమర్శలు చేస్తున్నారు.. కొంత మంది వికెట్లకు నేరుగా వచ్చే బంతులను ఆడటంలో బ్యాట్స్​మెన్లు విఫలమయ్యారని'' ఆయన చెబుతున్నారు.

ఇప్పటికే 2-1తో ఉన్న ఆతిథ్య జట్టుకు ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడేందుకు తదుపరి మ్యాచ్​ డ్రా అయితే చాలు. అందుకే పిచ్​.. స్పిన్​కు కాకుండా బ్యాటింగ్​కు అనుకూలించేలా మార్చే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

తదుపరి ఐపీఎల్​, టీ-20 ప్రపంచకప్​లోనూ నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కొత్త స్టేడియంపై విమర్శలు రాకుండా చూసుకోవాలని భావిస్తోంది.

వ్యక్తిగత కారణాలతో జస్ప్రీత్​ బుమ్రా జట్టుకు దూరమైన నేపథ్యంలో.. అతని స్థానంలో ఎవరిని టీమ్​లోకి తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇషాంత్​తో కలిసి బంతిని పంచుకునేందుకు సిరాజ్​, ఉమేశ్​లలో యాజమాన్యం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

ఇదీ చదవండి:సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు భారత మహిళా జట్లు ఇవే

ABOUT THE AUTHOR

...view details