తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టులకు గుడ్ బై చెప్పనున్న అఫ్గాన్​ ఆల్​రౌండర్​ - cricket

అఫ్గానిస్థాన్ ఆల్​రౌండర్ నబీ టెస్టు మ్యాచ్​లకు వీడ్కోలు చెప్పనున్నాడు.  బంగ్లాదేశ్​తో జరిగే తొలి టెస్టు తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​కు ముగింపు పలకనున్నాడు.

నబీ

By

Published : Sep 6, 2019, 8:22 PM IST

Updated : Sep 29, 2019, 4:37 PM IST

అఫ్గానిస్థాన్ ఆల్‌ రౌండర్‌ మహ్మద్‌ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. కెరీర్‌లో కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నబీ.. దీర్ఘకాల ఫార్మాట్​కు వీడ్కోలు చెప్పనున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు అనంతరం నబీ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడు.

రషీద్​ఖాన్​తో కలిసి స్పిన్ ద్వయంగా పేరు తెచ్చుకున్న నబీ బంగ్లాదేశ్‌తో ఆడుతున్న జట్టులో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవాలనే విషయాన్ని బోర్డుకు తెలిపాడు.

"అవును.. బంగ్లాదేశ్‌తో టెస్టు తర్వాత నబీ రిటైర్‌ అవుతున్నాడు. నబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టెస్టు ఫార్మాట్‌ నుంచి అతడు తప్పుకోవడానికి గల కారణాలను మేము అర్థం చేసుకోగలం"
-నజీమ్‌, అఫ్గానిస్థాన్ జట్టు మేనేజర్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్‌ షా సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లా జట్టు 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

ఇవీ చూడండి.. నాలుగో స్థానంపై కొత్త బ్యాటింగ్​ కోచ్​ మనసులో మాట

Last Updated : Sep 29, 2019, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details