భారత్-ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ను హెలికాఫ్టర్ నుంచి వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం రోజు తమిళనాడు పర్యటన అనంతరం.. దిల్లీకి పయనమైన క్రమంలో ఈ ఆసక్తికరమైన దృశ్యం తనను ఆకర్షించందన్నారాయన. సంబంధిత ఎంఏ చిదంబరం స్డేడియం దృశ్యాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 134పరుగులకే అలౌట్ చేసి మ్యాచ్‌పై పట్టుబిగించింది భారత్. ఇప్పటికే 249 పరుగుల ఆధిక్యం సాధించిన టీమ్ఇండియా.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా ప్రణాళికలు వేస్తోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(25), పుజారా(7) క్రీజులో ఉన్నారు.