అలిస్సా హెలే - మిచెల్ స్టార్క్.. భార్యాభర్తలైన ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం యాషెస్ నాలుగో టెస్టులో ఓ వికెట్ తీసి ఆకట్టుకున్నాడు స్టార్క్. అదే సమయంలో వెస్టిండీస్‌తో జరిగిన మహిళల రెండో వన్డేలో ఫోర్ కొట్టింది అలిస్సా. ఇద్దరి మధ్య 3వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ యాదృచ్ఛికంగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
యాషెస్ తొలి మూడు టెస్టులకు దూరమైన స్టార్క్ నాలుగో మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టోను పెవిలియన్ పంపాడు. వెస్టిండీస్ ఆంటిగ్వా వేదికగా జరిగిన మహిళల వన్డేలో అలిస్సా 43 బంతుల్లో 58 పరుగులతో ఆకట్టుకుంది. ఈ వీడియోను వ్యాఖ్యాత లీసా స్తలేకర్ ట్విట్టర్లో పంచుకుంది.