తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై అభిమానులకు శుభవార్త.. ఆ​ స్టాండ్స్ సిద్ధం - ధోనీ చెన్నై సూపర్​ కింగ్స్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఉన్న మూడు స్టాండ్స్​కు మోక్షం లభించింది. రానున్న ఐపీఎల్​ సీజన్​ కోసం, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వాటిని తెరవనున్నారు.

చెన్నై అభిమానులకు శుభవార్త.. ఆ​ స్టాండ్స్ సిద్ధం
మహేంద్ర సింగ్ ధోనీ

By

Published : Jan 31, 2020, 10:51 AM IST

Updated : Feb 28, 2020, 3:29 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​​లో చెన్నై అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్త ఇది. చెపాక్​ స్టేడియంలో గత కొంత కాలంగా మూసివేసిన మూడు స్టాండ్స్​ను తిరిగి వాడుకలోకి తీసుకురానున్నారు. తాజాగా ఈ విషయంపై చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ సూచించిన విధంగా స్టాండ్స్‌లో మార్పులు చేసేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్​ అంగీకరించింది.

ఇంతకీ ఏం జరిగింది?

2012లో చెపాక్ స్టేడియంలో అధునాతనంగా మూడు స్టాండ్స్​ నిర్మించారు. వీటికి అనుమతిచ్చేందుకు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్​ నిరాకరించింది. అప్పటి నుంచి 12 వేల సామర్థ్యమున్న ఆ స్టాండ్స్​ను మూసేశారు. అంతర్జాతీయ మ్యాచ్​లు జరిగినప్పుడూ వాటిని తెరవలేదు. రానున్న ఐపీఎల్ సీజన్​ కోసం వాటిని పునః ప్రారంభించనున్నారు.

చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్

ఫిబ్రవరిలో ఈ స్టాండ్స్​కు సంబంధించిన పనులు మొదలవుతాయని చెప్పిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్.. ఐపీఎల్​ ప్రారంభమయ్యే సరికి​ వీటిని సిద్ధం చేస్తామని చెప్పింది. ఇకపై చెన్నై సూపర్​ కింగ్స్​.. సొంత మైదానంలో ఆడే మ్యాచ్​లు మరింత సందడిగా సాగనున్నాయి.

Last Updated : Feb 28, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details