తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెంచరీతో మెరిసిన మయాంక్.. రహానే అర్ధశతకం

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకంతో ఆకట్టుకున్నాడు. కెరీర్​లో మూడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. వైస్​ కెప్టెన్​ అజింక్య రహానే అర్ధశతకం పూర్తి చేశాడు.

మయాంక్ అగర్వాల్

By

Published : Nov 15, 2019, 1:11 PM IST

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా ఓపెనర్ మయాంక్​ అగర్వాల్​.. ప్రస్తుతం బంగ్లాదేశ్​పై శతకం బాదాడు. ఇండోర్​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 185 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్​లో మూడో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 15 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. రహానే అర్ధశతకం పూర్తి చేశాడు.

ఓవర్ నైట్ స్కోరు 86/1తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. అర్ధశతకం పూర్తి చేసిన పుజారాను అబుజాయేద్ ఔట్ చేశాడు. అనంతరం విరాట్ కోహ్లీనీ ఎల్బీడబ్ల్యూ చేసి డకౌట్​గా పెవిలియన్​కు పంపాడు.

ఇలాంటి పరిస్థితుల్లో రహానేతో కలిసి ఇన్నింగ్స్​ నడిపించాడు మయాంక్. వీరిద్దరూ కలిసి ఇప్పటికే వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలకడగా ఆడుతూ.. చెత్త బౌంతులను బౌండరీకి తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: భారత బౌలర్ల ధాటికి విండీస్ కుదేల్.. సిరీస్ కైవసం

ABOUT THE AUTHOR

...view details